: స్థానికత లెక్క తేలాల్సిందే... లేకపోతే ఉద్యోగాల్లోనూ సీమాంధ్రులు పోటీ పడతారు: టీఎస్ సీఎం కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు స్థానికత అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో నివసిస్తున్న వారిలో స్థానికులు, స్థానికేతరుల లెక్క తేలాల్సిందేనని ఆయన అసెంబ్లీ సాక్షిగా నిన్న వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఉపకార వేతనాలపై మాట్లాడిన సందర్భంగా స్థానికతను ప్రస్తావించిన కేసీఆర్, వీలయినంత త్వరగా ఈ విషయంలో లెక్క తేలాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని స్థానికేతరులకు కూడా ఉపకారవేతనమిస్తే, భవిష్యత్తులో వారు ఉద్యోగాల్లోనూ పోటీ పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 371డీ ప్రకారం స్థానికేతరులను గుర్తిస్తామన్నారు. ఇక కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించిన కేసీఆర్, వీరిలో పెద్ద సంఖ్యలో స్థానికేతరులు ఉన్నారన్నారు. స్థానికత అంశం తేలేదాకా యువత ఓపిక పట్టాలని, రానున్న రెండేళ్లలో లక్ష ఉద్యోగాలనూ భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News