: లేడీస్ హాస్టల్ లో యువకుడి చొరబాటు... బెంబేలెత్తిన అమ్మాయిలు!


హైదరాబాదులోని ఎస్.ఆర్.నగర్ పరిధిలోని మధురానగర్ లో నిన్న రాత్రి కలకలం రేగింది. మధురానగర్ లోని ఓ లేడిస్ హస్టల్ లోకి నిన్న రాత్రి ఓ యువకుడు చొరబడ్డాడు. హాస్టల్ లోని అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో బెంబేలెత్తిపోయిన అమ్మాయిలు కేకలు వేశారు. అనంతరం స్థానికుల సహాయంతో అమ్మాయిలు ఆ యువకుడి భరతం పట్టారు. హాస్టల్ లోనే నిర్బంధించి చితకబాదిన అమ్మాయిలు అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన షీ టీమ్ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News