: స్నాప్ డీల్ లో ఇల్లు కూడా కొనుక్కోవచ్చు!


ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్ డీల్ ఇప్పుడు తన పరిధిని విస్తరించింది. తాజాగా, ఫ్లాట్లను కూడా విక్రయించేందుకు సిద్ధమైంది. దేశంలో అగ్రగామి రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ ఈ మేరకు స్నాప్ డీల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ హౌసింగ్ ప్రాజెక్టుల్లోని 50 ఫ్లాట్లను ఆన్ లైన్లో అమ్మకానికి ఉంచింది. వీటి ధరలు రూ.34 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ఉన్నాయి. ఒక్క శాతం తగ్గింపు ధరతో స్నాప్ డీల్ లో ఈ ఫ్లాట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ఈ వారంలో ఆరంభం కానుంది. న్యూ చండీగఢ్, పంచకుల, లక్నో, బెంగళూరు, చెన్నై, కోచి, కోల్ కతా ప్రాంతాల్లో నిర్మించిన ఫ్లాట్లను డీఎల్ఎఫ్ సంస్థ స్నాప్ డీల్ భాగస్వామ్యంతో విక్రయించనుంది.

  • Loading...

More Telugu News