: విద్యార్థులు రోడ్డెక్కడం మంచిది కాదు: ఆర్జీయూకేటీ వీసీ
విద్యార్థులు క్యాంపస్ లోనే కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆర్జీయూకేటీ వీసీ సత్యనారాయణ సూచించారు. ఇడుపులపాయ ఐఐఐటీలోని మెస్ లో మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులకు సాంబారులో కప్ప కనిపించింది. దీంతో, గత రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యల పేరు చెప్పి విద్యార్థులు రోడ్డెక్కడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మెస్ నిర్వాహకులను మార్చాలన్న విద్యార్థుల డిమాండ్ ను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో ఇలాగే హామీ ఇచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని విద్యార్థులు ఆరోపించారు.