: ఏపీ రాజధాని ప్రాంతం ఐనవోలు రైతులకు చెక్కుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూ ఒప్పందాల ప్రక్రియ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలోని రైతులతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అధికారులు భూ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా 42 మంది రైతులకు 113 ఎకరాలకు సంబంధించిన తొలి ఏడాది కౌలు చెక్కులు పంపిణీ చేశారు.