: ఏటీఎంల వద్ద భద్రతపై మురళీ మోహన్ ఆందోళన


నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఏటీఎంల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏటీఎంలలో డబ్బులు తీసుకునే వ్యక్తులపైనే కాకుండా, సెక్యూరిటీ గార్డులపైనా దాడులు ఎక్కువయ్యాయని సభకు వివరించారు. అందుకే, దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద భద్రతను పెంచుతూ తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్ సభ జీరో అవర్ లో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు.

  • Loading...

More Telugu News