: నటుడు ఏవీఎస్ కుమారుడి ఇంట్లో బిల్డర్ అనుచరుల రగడ
హైదరాబాదులో రియల్ ఎస్టేట్ నేపథ్యంలో ఎన్నో వివాదాలు, విధ్వంసాలు చోటుచేసుకోవడం తెలిసిందే. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఆయా భూముల విలువను బట్టి వివాదాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. తాజాగా, ఓ ఫ్లాట్ విషయంలో దివంగత నటుడు ఏవీఎస్ కుమారుడు ప్రదీప్ నివాసంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆయన నివాసంలో ప్రవేశించిన కొందరు వ్యక్తులు కత్తులు, బీరు సీసాలతో అందరినీ భయాందోళనలకు గురిచేశారు. దీనిపై, ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డర్ మూర్తి తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు తెలిపారు.