: బిల్లులో సవరణలకు కేంద్రం సిద్ధంగా ఉంది: గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
భూసేకరణ బిల్లులో మార్పులు చేర్పులు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తెలిపారు. లోక్ సభలో భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేసిన ఆరు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని బిల్లులో మార్పులు చేశామని అన్నారు. బిల్లుపై మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. మార్పులు, చేర్పులు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును పాస్ చేద్దామని ఆయన సూచించారు.