: మీ పశువులతో 'సెల్ఫీ' తీసుకోండి... నిరూపించుకోండి: రైతులకు పోలీసుల సూచన


గ్రామాల్లో పశువుల దొంగతనాలు, పశువు నాదంటే నాదని రేగే గొడవలూ తెలిసిన విషయాలే. అలాంటి వ్యవహారాలు తమ వద్దకు వచ్చినప్పుడు సత్వరం పరిష్కరించేందుకు వీలుగా లక్నో పోలీసులు వినూత్న కార్యాచరణకు తెరదీశారు. తమతమ పశువులతో సెల్ఫీలు తీసుకొని, వాటిని సమీప పోలీస్ స్టేషన్ లో సమర్పించాలని నగర శివారు ప్రాంతంలోని మోహన్ లాల్ గంజ్ రైతులకు స్పష్టం చేశారు. భవిష్యత్తులో పశువులకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తిప్పుడు ఈ ఫొటోలు ఉపయోగపడతాయని పోలీసులు భావిస్తున్నారు. మోహన్ లాల్ గంజ్ సర్కిల్ ఆఫీసర్ రాకేశ్ నాయక్ తన పరిధిలోని అన్ని స్టేషన్లకు ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. ఒక్క పశువు కోసం ఇద్దరు వస్తారని, అలాంటప్పుడు అది ఎవరి పశువో తెలియక జుట్టు పీక్కోవాల్సి వస్తుందని నాయక్ తెలిపారు.

  • Loading...

More Telugu News