: మసరత్ ను విడుదల చేయమని చెప్పింది హోంశాఖే... వెలుగులోకి వచ్చిన ఉత్తర్వులు!


వేర్పాటువాద నేత మసరత్ విడుదలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటును తప్పుదారి పట్టించారని విపక్షాలు విమర్శించాయి. ఆయనను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ముఫ్తీ ప్రభుత్వం కాదని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి జమ్మూ కోర్టుకు ఉత్తర్వులు అందాయని ఒక టీవీ ఛానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో పార్లమెంటులో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఉదంతాన్ని విపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రంగా వాడుకున్నాయి. ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల్లో, ప్రజారక్షణ చట్టం కింద వేర్పాటువాదులను అరెస్ట్ చేసిన ఘటనలలో నిర్ణీత సమయంలోగా రాష్ట్ర హోంశాఖ స్పందించకుంటే వారిని నిర్బంధం నుంచి విముక్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ పేరిట జమ్మూ జిల్లా న్యాయమూర్తికి ఈ ఉత్తర్వులు అందాయి. పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మసరత్ నిర్బంధంపై హోంశాఖ స్పందించలేదని తెలుపుతూ అతన్ని విడుదల చేయాలని జిల్లా న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఈ మొత్తం ఘటన కేంద్ర వైఫల్యమేనని, తెలియదని రాజ్ నాథ్ ఎలా తప్పించుకుంటారని విపక్షాలు ధ్వజమెత్తాయి.

  • Loading...

More Telugu News