: భారత క్రికెట్ టీమ్ ను అభినందించిన రాష్ట్రపతి
ప్రపంచకప్ లో అద్భుతమైన ఆటతో అదరగొడుతున్న ఇండియన్ క్రికెట్ టీమ్ పై అభినందనల వర్షం కురుస్తోంది. ధోనీ సేన ప్రదర్శనను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. ఈ మెగా టోర్నీలో వరుసగా ఐదు మ్యాచ్ లలో గెలుపొందడం అభినందనీయమని చెప్పారు. గ్రూప్-బీ లో అగ్రస్థానంలో కొనసాగుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. టీమ్ ఇండియాకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.