: చైనాలో భారీ భూకంపం
ఛైనాలోని సిచాన్ ప్రాంతంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ ధాటికి 30 మందికి పైగానే మరణించినట్లు చైనా సెంట్రల్ టెలివిజన్ వెల్లడించింది. సుమారు 400 మంది గాయపడినట్లు తెలిపింది. భూ ప్రకంపనలతో ఇక్కడి లుషాన్ ప్రాంతంలోని యాన్ నగరంలో ప్రజలు భయంతో ఒక్కసారిగా రహదారులపైకి పరుగులు తీశారు. మరోవైపు చెైనా సైన్యం బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7గా నమోదైంది.