: జగన్ తాత చరిత్ర ఏమిటి?: అసెంబ్లీలో ధూళిపాళ్ల


విమర్శలు, ప్రతివిమర్శల మధ్య ఏపీ అసెంబ్లీ వాడీవేడిగా కొనసాగుతోంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై టీడీపీ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తే, చంద్రబాబు అవినీతిపరుడంటూ జగన్ ప్రత్యారోపణ చేశారు. ఈ సందర్భంలో టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ అధినేత జగన్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై సీపీఎం ఒక పుస్తకాన్ని ముద్రించిందని జగన్ చెబుతున్నారని... చంద్రబాబుపై ఆరోపణలు వాస్తవాలైతే ఆ రోజు రాజశేఖరరెడ్డి చేతులు ముడుచుకున్నారా? అని విమర్శించారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మండిపడ్డారు. జగన్ తాత రాజారెడ్డి చరిత్ర ఏమిటని ప్రశ్నించారు. వెంకటసుబ్బయ్య అనే గని యజమానిని చంపిన చరిత్ర జగన్ కుటుంబానిదని ఆరోపించారు. ఊరి నుంచి వెలివేస్తే పులివెందుల వచ్చి ఆశ్రయం పొందారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News