: ఐర్లాండ్ పై ఘనవిజయం... వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలో ఇండియా మరో రికార్డు


హామిల్టన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ పోరులో భారత జట్టు ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే సమయంలో ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో 9 వరుస విజయాలు సాధించిన అరుదైన ఘనతనూ సొంతం చేసింది. 2011లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో భారత్ 4 వరుస విజయాలు సాధించగా, ప్రస్తుత టోర్నీలో వరుసగా 5 విజయాలు నమోదుచేసింది. కాగా, నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ 49 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 36.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్నందుకుంది. జట్టులో శిఖర్ ధావన్ 100, రోహిత్ శర్మ 64 పరుగులు చేసి అవుట్ కాగా, మిగిలిన లాంచానాన్ని కోహ్లీ (44 నాటౌట్), రహనే (33 నాటౌట్)పూర్తి చేశారు. సెంచరీ తో రాణించిన ధావన్ కు 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News