: గాంధీజీ ఓ బ్రిటీష్ ఏజెంట్: మార్కండేయ కట్జు


సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు తనదైన శైలిలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి తీవ్ర హాని చేసిన మహత్మాగాంధీ ఓ బ్రిటీష్ ఏజెంట్ అని తన బ్లాగ్ లో వ్యాఖ్యానించారు. 'వాట్ ఈజ్ ఇండియా?' పేరుతో రాసిన ఓ ఆర్టికల్ లో గాంధీపై కట్జు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. "ఇలా అనడం వల్ల నాపై చాలా దూషణలు వస్తాయని నాకు తెలుసు. కానీ ప్రజాదరణ ఆశించని వ్యక్తిని కాబట్టి తనకు ఇదో పెద్ద విషయం కాదన్నారు. ఇటువంటివి ప్రారంభంలో నన్ను అప్రజాదరణకు గురిచేస్తాయి. దాంతో నేను అవమానానికి గురవుతాను, పలువురు నా వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తారు. ఏదేమైనా నా దేశం ఆసక్తి మేరకు కొన్ని విషయాలు చెబుతున్నానని నమ్ముతాను" అని కట్జు ముందుగా పేర్కొన్నారు. "నేనిలా అనడానికి కారణాలు ఇవి: 1.)భారతదేశంలో అద్భుతమైన వైవిధ్యం ఉంది, చాలా మతాలు, కులాలు, జాతులు, భాషలు వగైరా ఉన్నాయి" అని చెప్పారు. 'విభజించు-పాలించు' అనేది బ్రిటీష్ విధానం అని అందరికీ తెలుసునని, తరువాత కాలంలో దాన్ని గాంధీ మరింత విస్తరించారని ఆరోపించారు. ఇలా తన బ్లాగ్ లో మహాత్ముడిపై కట్జు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News