: శాసనసభలో వీధికొట్లాటకు దిగుతారా?: జానారెడ్డి
తెలంగాణ శాసనసభలో ఈరోజు అధికార, విపక్ష సభ్యుల మధ్య చోటుచేసుకున్న ఘటనపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, విపక్ష సభ్యులు ఆవేశంతో మాట్లాడుతున్నారన్నారు. మంత్రులు ఉద్వేగంతో మాట్లాడుతున్నారని, అధికారదర్పంతో మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని చురకంటించారు. అలాగని శాసనసభలో వీధికొట్లాటకు దిగుతారా? అని ప్రశ్నించారు. అరుణ ఆవేశంతో మాట్లాడారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ను చూసిన తరువాత స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జానా కోరారు.