: ఇండియా అరుదైన రికార్డు


వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా 5 వరుస మ్యాచ్ లలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఆలౌట్ చేసి టీమిండియా అరుదైన ఘనతను దక్కించుకుంది. దీంతోపాటు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో వరుసగా 9 విజయాలు సాధించిన జట్టుగా కూడా ఇండియా నిలవనుంది. కాగా, హామిల్టన్ లో ఐర్లాండ్ తో జరుగుతున్న పోరులో 260 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ను ప్రారంభించింది. తొలి ఓవర్ మూడో బంతికి సింగల్ తీయడం ద్వారా పరుగుల ఖాతా తెరిచింది. నాలుగో బంతిని రోహిత్ శర్మ బౌండరీకి తరలించాడు. ప్రస్తుతం భారత స్కోర్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు.

  • Loading...

More Telugu News