: టీఆర్ఎస్ ఎంఎల్ఏను నోరు మూసుకోమన్న డీకే అరుణ


గుర్రం గడ్డ ప్రాజెక్టుకు సంబంధించి డీకే అరుణ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు. ఆ తరువాత అరుణ మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ సభ్యుడు విద్యాసాగర్ రావు అడ్డు పడ్డారు. దీంతో అరుణమ్మకు కోపం వచ్చింది. ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ, "ఎం మాట్లాడుతున్నావు? ఏం పనులూ చేయొద్దంటావా? నువ్వు కూర్చో... నోరు మూసుకో, ఏం మాట్లాడుతున్నావు... మధ్యలో వచ్చి ఏం మాట్లాడతావు? మహిళలపై గౌరవం ఎట్లనూ లేదు. మీరు ఆ అంటే మేము నోరు మూసుకోవల్నా? నోరు మూసుకోం. మా మహిళల నోరు మూపించేశారు మీరంతా కలసి. కనీసం మంత్రివర్గంలో ఒక్కరికి కూడా స్థానం లేదు" అని ఊగిపోయారు. ఆ తరువాత కేటీఆర్ సైతం ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఒక మంత్రిగా పనిచేసిన సభ్యురాలు అన్ పార్లమెంటరీ పదాలు వాడడం సరికాదని అన్నారు. నోరుమూసుకో అని అనడం పద్ధతేనా? అంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News