: రూ. 60కే రోటావైరస్ టీకా... ప్రపంచంలోనే అత్యంత చౌక!
భారత శాస్త్రజ్ఞులు మరో అరుదైన ఘనత సాధించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అతిసారం (డయేరియా) టీకా 'రోటా వైరస్'ను ప్రధాని నరేంద్ర మోదీ మార్కెట్లోకి విడుదల చేశారు. దీని ధర ఒక డోసుకు రూ. 60 మాత్రమే. ఇది ప్రపంచంలో అత్యంత చౌక కావడం విశేషం. కాగా, ప్రతి ఏటా 80,000 మంది 5 ఏళ్ల లోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ ఈ వాక్సిన్ ను తయారుచేసింది. 'రోటావ్యాక్' పేరిట లభ్యమవుతున్న ఈ టీకా అతిసార నివారణకు అందుబాటులో వున్న మూడో రోటావైరస్ టీకా కావడం గమనార్హం. అత్యున్నత స్థాయి పరిశోధన అభివృద్ధి, ఫార్మా ఉత్పత్తుల తయారీలో భారత సామర్థ్యానికి ఈ టీకా ఆవిష్కరణ ఒక మంచి ఉదాహరణ అని మోదీ కొనియాడారు.