: ఉమెన్స్ డే నాడు చంద్రబాబు జిల్లాలో దళిత యువతిపై హత్యాచారం... రెండ్రోజుల్లో కేసు ఛేదన


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ప్రపంచ మహిళా దినోత్సవం నాడు దళిత యువతి సామూహిక అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు, తక్షణమే నిందితులపై కేసు నమోదు చేయడంతో పాటు మృగాళ్లను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. పెనుమూరు మండలం దిగునపూనేపల్లిలొో దళిత యువతి రీటాను నీవా నది వద్దకు తీసుకెళ్లిన నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటనపై సీఎం సీరియస్ అయిన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు ఉదయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News