: జపాన్, సింగపూర్ తో జరిగిన ఒప్పందాలు బయటపెట్టండి: జనచైతన్య వేదిక
జపాన్, సింగపూర్ దేశాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేసింది. హైదరాబాదులో జనచైతన్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, రాజధాని అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపార ధోరణితో చూస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఏకపక్ష ధోరణి చూస్తుంటే అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. నాగరిక సమాజంలో బాబు అనాగరిక పోకడలకు పోతున్నారని వారు మండిపడ్డారు.