: ఏవిటీ వైపరీత్యం... విలీనం కావాల్సింది పార్టీలు...సభ్యులు కాదు: కొండా రాఘవరెడ్డి
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పార్టీలు విలీనం కావాలి కానీ సభ్యులు విలీనం కావడం ఏమిటని ప్రశ్నించారు. మండలి ఛైర్మన్ అలా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన అడిగారు. దీనిపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పందించాలని ఆయన సూచించారు. సభ్యులు పార్టీ మారితే వారిని ఫిరాయింపుదారులు అంటారని ఆయన తెలిపారు. దీనిపై రాజకీయపార్టీలన్నీ విమర్శలు చేస్తున్నాయి.