: మోత్కుపల్లి అరెస్టు... సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి టీడీపీ యత్నం


దళితులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదని, దళితులను ముఖ్యమంత్రి మోసం చేశారని పేర్కొంటూ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టిన టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఉన్న ఇతర నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో, టీడీపీ నేతలు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయల్దేరారు. కాగా, వారిని అడ్డుకునేందుకు పోలీసులను మోహరించారు. మోత్కుపల్లి దీక్ష భగ్నంపై తెలంగాణ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News