: మీ నేతలే నిన్ను పట్టించుకోవడం లేదు... నువ్వా, మమ్మల్ని అనేది?: ఉత్తమ్ పై టీఆర్ఎస్ ఫైర్


నిన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఉత్తమ్ ను పట్టించుకోవడం లేదని, అంతర్గత కుమ్ములాటలను సర్దుకోలేక తమపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నడూ 'జై తెలంగాణ' అని నినదించని వ్యక్తిని తెలంగాణకు చీఫ్ గా ఎలా నియమించారని కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News