: మార్చి 25 నుంచి అన్నా హజారే 1100 కిలోమీటర్ల పాదయాత్ర
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టనున్న పాదయాత్ర తేదీలు ఖరారయ్యాయి. మార్చి 25న ఆయన తన సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 1100 కిలోమీటర్లు నడక సాగిస్తారు. యాత్రలో తారసపడే ప్రతి గ్రామంలో రైతులను చైతన్యవంతం చేస్తూ, సంఘటితం చేస్తామని ఆయన చెప్పారు. రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఉన్న భూసేకరణ బిల్లు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మార్చి 25న సేవా గ్రామ్ లో ప్రారంభం కానున్న పాదయాత్ర ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే బహిరంగ సభతో ముగియనుంది. ఇది పూర్తయ్యేందుకు రెండున్నర నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు.