: 54 ఆసుపత్రులు సీఎం రిలీఫ్ ఫండ్ ను అప్పనంగా ఆరగించాయి!


సీఎం రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ పై తెలంగాణా రాష్ట్ర సీఐడీ విభాగం విచారణలో వేగం పెంచింది. దీంతో, కార్పొరేట్ ఆసుపత్రుల భాగోతాలు వెలుగుచూస్తున్నాయి. రిలీఫ్ ఫండ్ గోల్ మాల్ వ్యవహారంలో 1251 ఆసుపత్రుల దరఖాస్తులను సీఐడీ పరిశీలించింది. 54 ఆసుపత్రుల దరఖాస్తుల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్టు సీఐడీ గుర్తించింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 20 ఆసుపత్రులు, హైదరాబాదులోని 34 ఆసుపత్రుల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్టు సీఐడీ గుర్తించింది. ఇందులోని పలు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినట్టు సీఐడీ వెల్లడించింది. ఈ దరఖాస్తుల విషయంలో ఆయా ఆసుపత్రులను సీఐడీ ప్రశ్నించనుంది. విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. కార్పొరేట్ ఆసుపత్రుల నకిలీ లెటర్ హెడ్స్ ను సీఐడీ గుర్తించింది. వీటికి సూత్రధారులు ఎవరు? అనేది కూడా ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News