: బ్లాక్ మండే!... రూ.80 వేల కోట్లు ఆవిరి


భారత స్టాక్ మార్కెట్ మరో బ్లాక్ మండేను కళ్ళజూసింది. అంతర్జాతీయ మార్కెట్ల నష్టాలు, అమెరికా విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి. దీంతో, ఈక్విటీల అమ్మకాలు వెల్లువెత్తడంతో, సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 150 పాయింట్ల నష్టంతో నిలిచిన సెన్సెక్స్ మరే దశలోనూ పుంజుకుంటున్నట్టు కనిపించలేదు. బీఎస్ఈ ప్రాథమిక గణాంకాల ప్రకారం సుమారు రూ. 80 వేల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ సూచి 604.17 పాయింట్లు పడిపోయి 2.05 శాతం నష్టంతో 28,844.78 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచి 181 పాయింట్లు పడిపోయి 2.03 శాతం నష్టంతో 8,756 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.30 శాతం, స్మాల్ క్యాప్ 0.92 శాతం నష్టపోయాయి. జిందాల్ స్టీల్ అత్యధికంగా 4.56 శాతం లాభపడగా, హెచ్ యూఎల్, లూపిన్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా తదితర కంపెనీల వాటాల విలువ పెరిగింది. ఇదే సమయంలో ఎస్ఎస్ఎల్ టీ, హిండాల్కో, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, గెయిల్ తదితర కంపెనీల వాటాల విలువ 4 శాతం కన్నా అధికంగా పడిపోయింది.

  • Loading...

More Telugu News