: మేం ప్రతి చోటా ఉంటాం... హర్యానా ప్రభుత్వ వెబ్ సైట్లో 'ఐఎస్ఐఎస్' సందేశం
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు హర్యానా ప్రభుత్వానికి చెందిన ఎస్.సి.ఈ.ఆర్.టి వెబ్ సైట్ ను హ్యాక్ చేసింది. 'మేం ప్రతి చోటా ఉంటాం' అంటూ ఆ వెబ్ సైట్ హోం పేజీలో ఓ సందేశాన్ని పోస్టు చేసింది. సైట్ హోం పేజీలో ఐఎస్ఐఎస్ పతాకాన్ని గుర్తించిన ఓ టీచర్ ఈ విషయాన్ని అధికారులకు తెలియపర్చాడు. హోలీ సందర్భంగా ఎవరూ ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. హోలీ తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఆ సందేశాన్ని తొలగించి, సైట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, అధికారిక సమాచారం ఏమైనా తస్కరణకు గురైందా? అన్న దానిపై స్పష్టత రాలేదు.