: బెజవాడ వస్తే మా ఇంటికి రండి... టీపీసీసీ చీఫ్ కు దేవినేని ఆహ్వానం
అసెంబ్లీ లాబీల్లో నేడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ పీసీసీ నూతన చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ తమ సభల నుంచి బయటికి వచ్చిన సమయంలో ఒకరినొకరు పలకరించుకున్నారు. చాలా బాగా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కితాబివ్వగా, ఉమా చిరునవ్వుతో స్వీకరించారు. ఇరుగుపొరుగు నియోజకవర్గాలకు చెందిన వాళ్లమని, కలసికట్టుగా ఉండాలని కాంగ్రెస్ నేత పేర్కొనగా... ఉమా సానుకూలంగా స్పందించారు. అంతేగాకుండా, ఎప్పుడైనా విజయవాడ వస్తే తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కూడా కోరారు.