: తెలంగాణలో బీఎస్పీ లేదు... ఇకపై వారు టీఆర్ఎస్ వారే
తెలంగాణలో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప పోటీకి దిగి విజయం సాధించారు. కాల క్రమంలో వారు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో తెలంగాణలో అసెంబ్లీలో బీఎస్పీ సభ్యులు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. వారిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్టు తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. దీంతో, ఫిరాయింపుదారులుగా వారిపై వేసిన ముద్ర చెల్లదని, వారు ఇష్టపూర్వకంగా టీఆర్ఎస్ లో చేరారని చెబుతూ ఒక బులెటిన్ విడుదల చేశారు. కాగా, ఈ రోజే పలువురు ఫిరాయింపు ఎమ్మెల్సీలను కూడా టీఆర్ఎస్ వారిగా పేర్కొనడం తెలిసిందే.