: జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సహచరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసును వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ డీఎంకే నేత వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ మేరకు జయలలితకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, జయలలిత అక్రమాస్తుల కేసును విచారిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమెకు సహకరిస్తున్నారని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. అతని సహకారం వల్లే ఆమెకు బెయిల్ మంజూరైందని పిటిషనర్ వ్యాఖ్యానించారు.