: ఆడేటప్పుడు ఆటోగ్రాఫులు వద్దు: క్రికెటర్లకు బీసీసీఐ సూచన


ప్రముఖుల నుంచి తీసుకున్న ఆటోగ్రాఫులను అభిమానులు ఎంతో అపురూపంగా భావిస్తారు. ముఖ్యంగా, క్రీడాకారుల విషయంలో ఆటోగ్రాఫులు కోరే అభిమానుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఈ ఆటోగ్రాఫుల కారణంగా ప్లేయర్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. తాజాగా, బీసీసీఐ మ్యాచ్ ఆడే సమయంలో ఆటోగ్రాఫులు ఇవ్వొద్దని క్రికెటర్లకు స్పష్టం చేసింది. ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ టి20, భారత్ లో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే అన్ని మ్యాచ్ లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఓ ఆటోగ్రాఫ్ బుక్ సాయంతో బుకీలు కీలక సమాచారాన్ని ఆటగాళ్లతో పంచుకునే అవకాశం ఉందని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అనుమానిస్తోంది. ఆటోగ్రాఫుల వ్యవహారాన్ని కట్టడి చేయడం కష్టమే అయినా, క్రికెట్ శ్రేయస్సు దృష్ట్యా ప్రపంచవ్యాప్త నిషేధానికి ప్రయత్నిస్తున్నామని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కేఎస్ మాధవన్ తెలిపారు.

  • Loading...

More Telugu News