: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మాటలయుద్ధం
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ఏపీ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. రాజధాని కోసం సమీకరించిన భూములను రైతులే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాదించగా, ఏ ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా భూములిచ్చిన దాఖలా లేదని విపక్ష సభ్యులు ప్రతివాదానికి దిగారు. రాజధాని నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబునాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాజధాని నిర్మితమవుతున్న ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులనూ సంప్రదించడం లేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో అభివృద్ధికి విపక్షం అడ్డుతగులుతోందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి విమర్శలు చేశారు. దీంతో, సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.