: ఒకరినొకరు కాల్చి చంపుకున్న పోలీసులు
విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు గొడవపడి ఒకరిని ఒకరు కాల్చి చంపుకున్నారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలోని విక్రమ్ బ్లాక్ ఆఫీసులో జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం డ్యూటీలో ఉన్న పోలీసులిద్దరు పరస్పరం ఘర్షణ పడ్డారు. వాదులాట పెరిగి ఆవేశంలో తమ సర్వీస్ రైఫిళ్లతో కాల్చుకున్నారు. ఈ దుర్ఘటనలో ఇద్దరూ చనిపోయారని పాట్నా పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర రాణా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టామని, కాల్పులకు దారితీసిన అసలు విషయాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.