: మరచిపోదామనుకున్నా... మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు: ఉబెర్ బాధితురాలి ఆక్రోశం


తాను ప్రతి రోజూ మానసిక క్షోభను అనుభవిస్తూనే ఉన్నానని గత సంవత్సరం ఢిల్లీలో ఉబెర్ టాక్సీ డ్రైవర్ చేతిలో అత్యాచారానికి గురయిన 25 ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఆ దారుణ సంఘటనను మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ, పదే పదే దాన్ని గుర్తొచ్చేలా చేస్తున్నారని, అత్యాచారం చేసిన డ్రైవర్ తరఫు న్యాయవాది తనను రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు గుచ్చిగుచ్చి ప్రశ్నించి తనను మానసిక క్షోభకు గురి చేశారని ఆ యువతి పేర్కొంది. భారత్‌ లో తన కార్యకలాపాలను కొనసాగించాలని చూస్తున్న ఉబెర్ కేవలం పైపై పూతలతో నెట్టుకురావాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. భద్రతపరంగా సరైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మహిళలు సురక్షితంగా ఉన్నామని భావించే దాకా మనం సమానత్వం సాధించలేమన్న ఆమె, ఈ విషయాన్ని ఉబెర్ అర్థం చేసుకోవడం లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News