: 'వాడు నన్ను కత్తితో పొడిచాడు డార్లింగ్'... సిడ్నీలో మరణించే ముందు భర్తతో చెప్పిన టెక్కీ


మొన్న రాత్రి సిడ్నీలో దారుణ హత్యకు గురైన భారత మహిళా టెక్కీ ప్రభా అరుణ్ కుమార్ దుండగులు దాడి చేసిన సమయంలో తన భర్తతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు తెలిసింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని అడ్డదారిలో ఇంటికి వెళ్తున్న ఆమెను పొడిచి చంపిన సంగతి తెలిసిందే. నడుచుకుంటూ వస్తున్న ఆమెను దుండగులు చుట్టుముట్టిన విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది. 'వాడు నన్ను కత్తితో పొడిచాడు డార్లింగ్' అని కూడా చెప్పింది. ఆ తరువాత ఫోన్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఆమె ఇంటికి కేవలం 300 మీటర్ల దూరంలో ఈ ఘటన జరగగా, తీవ్ర రక్తస్రావం కావడంతో, ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. కాగా, ఆమె భర్త సిడ్నీకి చేరుకున్నారు. ఈ ఘటనపై రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

  • Loading...

More Telugu News