: ‘కల్లు తాగిన కోతులు’ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్... తాము నోరిప్పితే కడియం తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్న


టీ టీడీపీ నేతలను కల్లు తాగిన కోతులని వ్యాఖ్యానించిన తెలంగాణ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా మొన్న జరిగిన గొడవపై కొద్దిసేపటి క్రితం ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ మధుసూదనాచారి సమావేశమయ్యారు. అదే సమయంలో మీడియా పాయింట్ వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. మెజారిటీ జనాభా ఉన్న ఎస్సీలకు, మహిళలకు కేబినెట్ లో చోటివ్వలేదని కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, ఎంపీగా ఉన్న కడియం రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. అసలు ఎస్సీ సామాజిక వర్గానికే చెందన కడియం, ఎస్సీ రిజర్వ్ డ్ సీటులో ఎలా పోటీ చేశారని ప్రశ్నించారు. కడియం సామాజిక వర్గం గురించి తాము నోరిప్పితే, తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని ఇబ్బందిని కడియం ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అధిక జనాభా కలిగిన ఎస్సీలకు కేబినెట్ లో చోటివ్వని కేసీఆర్ సర్కారు వైఖరికి నిరసనగా మోత్కుపల్లి నిరసన దీక్షకు దిగుతున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News