: మారిషస్ కోర్టులో ‘ఎర్ర’ స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ... హాజరవుతున్న కర్నూలు ఎస్పీ


ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్ గా పేరుగాంచిన కొల్లం గంగిరెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై మారిషస్ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఏపీ పోలీసుల అభ్యర్థనతో రంగంలోకి దిగిన 'ఇంటర్ పోల్' అధికారులు గంగిరెడ్డిని మారిషస్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారిషస్ లోనే పోలీసుల అదుపులో ఉన్న అతడు తనకు బెయిల్ మంజూరు చేయాలని అక్కడి కోర్టును ఆశ్రయించాడు. అతడి బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు, నేడు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో అతడికి బెయిల్ మంజూరు చేయరాదంటూ కోర్టు ముందు వాదనలు వినిపించాలని ఏపీ సర్కారు భావించింది. సర్కారు ఆదేశాలతో గంగిరెడ్డి నేర చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలతో కర్నూలు జిల్లా ఎస్పీ రఘురాంరెడ్డి మారిషస్ బయలుదేరి వెళ్లారు. నేటి కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News