: నానక్ రాంగూడను చుట్టుముట్టిన పోలీసులు... పెద్ద సంఖ్యలో సారా బట్టీల ధ్వంసం


హైదరాబాదులోని నానాక్ రాంగూడను అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు చుట్టుముట్టారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ నేతృత్వంలో 200 మందికి పైగా పోలీసులు అక్కడ మోహరించి కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పెద్ద సంఖ్యలో సారా బట్టీలు దర్శనమిచ్చాయి. వాటిని ధ్వంసం చేసిన పోలీసులు సారా తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా ఇద్దరు మహిళలు సహా 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని తొమ్మిది బైకులను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News