: వృషభం అయితేనేం!... నెల తిరిగేసరికి కళ్లుచెదిరే సంపాదన!


హర్యానాలోని భివానీలో ఓ వృషభం ఉంది. దాని పేరు అర్జున్. విషయం ఏమిటంటే, అది ఒక్క నెలలో 9 లక్షల రూపాయల దాకా సంపాదిస్తుంది. ఎలాగంటారా.... అర్జున్ మేలుజాతి పశువు కావడంతో దాని వీర్యానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాని వీర్యంతో నెలలో దాదాపు 3 వేల ఇంజెక్షన్ లు సిద్ధం చేస్తారు. వీటిని కృత్రిమ గర్భధారణకు ఉపయోగిస్తారు. ఒక్కో ఇంజెక్షన్ సుమారు రూ.300 పలుకుతుందట. ఇంత ఆదాయం తెచ్చిపెట్టే వృషభ రాజాన్ని ఏ యజమాని అయినా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. అర్జున్ యజమాని పవన్ కూడా అలానే చూసుకుంటున్నాడు. రోజుకు రెండు సార్లు 5 లీటర్ల పాలు తాగిస్తారు. ఐదు కిలోల దాణా కూడా తినిపిస్తారు.

  • Loading...

More Telugu News