: టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదు గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పొన్నాల లక్ష్మయ్య నుంచి పగ్గాలు అందుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్లు భట్టివిక్రమార్క కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముందు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. పొన్నాల నివాసానికి వెళ్లి ఆయనను తోడ్కొని గాంధీ భవన్ కు వచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.