: సంగా ఖాతాలో వరల్డ్ కప్ రికార్డు


శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర సూపర్ ఫాం కొనసాగుతోంది. తాజాగా, సిడ్నీ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై సెంచరీ నమోదు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో సంగాకిది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. తద్వారా, ఓ వరల్డ్ కప్ టోర్నీలో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు పుటలకెక్కాడు. సంగా ఈ టోర్నీలో ఇంతకుముందు బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లపై సెంచరీలు సాధించడం తెలిసిందే. ఇక, సిడ్నీ మ్యాచ్ విషయానికొస్తే... 104 పరుగులు చేసిన సంగక్కర నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో, లంక జట్టు 34 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. విజయానికి 16 ఓవర్లలో 175 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో మాథ్యూస్ (8 బ్యాటింగ్), చాందిమల్ (0 బ్యాటింగ్) ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 376 పరుగుల భారీ స్కోరు సాధించింది.

  • Loading...

More Telugu News