: ఆ న్యాయవాది రేపిస్ట్ కన్నా వెరీ డేంజర్.... సమాజానికి ఎంతో ప్రమాదకారి: వర్మ


వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. నిర్భయ కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నేరస్తుడు ముఖేశ్ సింగ్ కేసు వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ ఎంఎల్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఎల్ శర్మ రేపిస్టు కన్నా ప్రమాదకరమైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. నిర్భయ ఉదంతంపై రూపొందిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీలో భాగంగా శర్మ ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో వర్మ పైవిధంగా వ్యాఖ్యానించారు. శర్మ లైంగిక దాడులకు పాల్పడేవారికన్నా సమాజానికి ఎంతో ప్రమాదకారి అని పేర్కొన్నారు. శర్మ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారతీయ సమాజంలో మహిళలకు స్థానం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యను బార్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించింది. అతనిపై చర్యలకు గాను సమావేశం కానుంది. 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీపై భారత్ లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News