: పోటాపోటీగా ఆడుతున్న దిల్షాన్, సంగా
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో శ్రీలంక నిలకడగా ఆడుతోంది. ఆదిలోనే ఓపెనర్ తిరిమన్నే (1) వికెట్ కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ దిల్షాన్ (49 బ్యాటింగ్), వన్ డౌన్ బ్యాట్స్ మన్ సంగక్కర (50 బ్యాటింగ్) ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. దీంతో, 15 ఓవర్లు ముగిసేసరికి లంక జట్టు వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 276 పరుగులు అవసరం. 35 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు, కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 376 పరుగులు చేశారు.