: హైదరాబాద్ పోలీసులకు ఇద్దరు మహిళల ఝలక్... కస్టడీ నుంచి పరారీ!
ఇద్దరు మహిళలు హైదరాబాద్ పోలీసులకు ఝలక్కిచ్చారు. కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకొని గత రాత్రి పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలను, ఇద్దరు విటులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. నేటి ఉదయం వారిలో ఇద్దరు మహిళలు పరారయ్యారు. వారు ఎలా బయటకు వెళ్లారనే విషయంపై విచారణ మొదలు పెట్టిన పోలీసులు సదరు మహిళల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.