: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... దర్శనానికి 12 గంటలు


దేవదేవుని గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 18 కంపార్ట్‌ మెంట్లలో భక్తులు వేచి వున్నారని అధికారులు తెలిపారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్టు వివరించారు. నిన్న స్వామివారిని 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలూ కలుగకుండా ఏర్పాట్లు చేసామని, క్యూలైన్లు, నడకదారి, కంపార్ట్‌ మెంట్లలో భక్తులకు భోజన సౌకర్యం కల్పించామని, పాలు, మజ్జిగ ఇస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News