: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా


ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా, మరో కీలక పోరుకు రంగం సిద్ధం అయింది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో పోటీ మొదలుకానుండగా, టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కాగా, గ్రూప్- ఏలో 5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్ గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. 6 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న లంక జట్టు సైతం మ్యాచ్ లో విజయం సాధించి మరో అవకాశం కోసం చూడకుండా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాలని భావిస్తోంది. దీంతో ఈ పోరు రసవత్తరంగా సాగవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News