: వీకెండ్ లో మందుకొట్టి దొరికిపోయిన వందలాది మంది
శనివారం మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. గత రాత్రి హైదరాబాద్ నగరంలోని పలు కూడళ్లలో కాపు కాసిన పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కూకట్ పల్లి, జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 215 మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 74 కార్లు, 138 ద్విచక్రవాహనాలను, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరందరిని సోమవారం నాడు కోర్టులో హాజరు పరచనున్నామని, అందరికీ కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.