: కబ్జాదారు గుండెల్లో దడపుట్టించిన చిట్టిగొంతులు


కెన్యా రాజధాని నైరోబీలో కబ్జాకోరు గుండెల్లో చిట్టి గొంతులు గుబులు రేపాయి. క్రిస్మస్ సెలవులు ముగియడంతో లంగట ప్రాథమికోన్నత పాఠశాల పిల్లలు స్కూలుకు చేరుకున్నారు. అయితే పాఠశాల ప్రాంగణంలోని విశాలమైన క్రీడాస్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. దానిపై ఆరా తీయగా పాఠశాల యాజమాన్యం అక్కడ కొంత స్థలాన్ని షాపింగ్ మాల్ కు విక్రయించడంతో వారు స్కూలు క్రీడామైదానంను కూడా ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. దీంతో స్కూలు పిల్లలతో కలిసి, ఉపాధ్యాయులు ఆ గోడను కూల్చేసేందుకు ప్రయత్నించారు. దీనిని అడ్డుకున్న పోలీసులు, పిల్లలు అని కూడా చూడకుండా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందింది. దీంతో నెటిజన్లంతా ప్రభుత్వం, పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో స్పందించిన కెన్యా అధ్యక్షుడు కెన్యాటా పోలీసుల దాడిని ఖండిస్తూ, దాడికి బాధ్యుడైన అధికారిని సస్పెండ్ చేశారు. మైదానం పిల్లలకు అప్పగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాల క్రీడామైదానంపై న్యాయస్థానానికి వెళ్లిన వారు కూడా కేసు వెనక్కి తీసుకున్నారు. దీంతో మొత్తం గోడను కూల్చేసి, మైదానాన్ని పిల్లలకు అప్పగించారు.

  • Loading...

More Telugu News