: కౌలాలంపూర్ లో కదంతొక్కిన మలేసియన్లు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలేసియన్లు కౌలాలంపూర్ లో కదంతొక్కారు. దేశ ప్రధాని నజీబ్ రజాక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మలేసియా ప్రతిపక్ష మధ్దతుదారులు ఆందోళన నిర్వహించారు. ప్రతి పక్షనేత అన్వర్ ఇబ్రహీంను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. 2008లో లైంగిక దాడికి పాల్పడ్డారన్న కేసులో ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీంకు ఐదేళ్ల శిక్ష విధిస్తూ స్థానిక న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో తన అరెస్టు వెనుక రాజకీయ కుట్రదాగి ఉందని ఆయన ఆరోపించారు. దీంతో ఆయన మద్దతు దారులు ఆందోళన నిర్వహించారు.